అర్జీలు స్వీకరించిన ఎస్పీ కృష్ణ కాంత్
ఎస్పీ గ్రీవెన్స్ కి 74 ఫిర్యాదులు…
- అర్జీలు స్వీకరించిన ఎస్పీ కృష్ణ కాంత్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పోలీసు అధికారులతో కలసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 74 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ DSP సింధుప్రియ, మహిళా పోలీస్ స్టేషన్ CI సుబ్బారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి, SB-2 CI శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.