టీఆర్ఎస్ నాయకులు అక్రమాలు వెలికి తీస్తాం

మీడియా సమావేశంలో గురజాల గోపి వెల్లడి

టీఆర్ఎస్ నాయకులు అక్రమాలు వెలికి తీస్తాం

  • మీడియా సమావేశంలో గురజాల గోపి వెల్లడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో రేణుక చౌదరి క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గురుజాల గోపి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురజాల గోపి మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయునిగా పని చేసిన రేగా కాంతారావు సేవలను గుర్తించి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధి చేసిందన్నారు. అలాగే కెసిఆర్ ప్రభుత్వంలో విప్ గా కేటాయించిందని చెప్పారు. అలాంటి కాంతారావు ఈరోజు హద్దులు మీరు జూన్ 30 తారీఖున కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేయటం హేయమైన చర్యని మండిపాటుకు గురయ్యారు. అవాంఛనీయ ఘటనలు అధికార పార్టీపై చూపే ప్రస్తావన వస్తే, టిఆర్ఎస్ నాయకులపై కూడా అక్రమాలు వెలికి తీసే ప్రయత్నం చేపడుతామని మీడియా పూర్వకంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *