కావలి ఆర్డీవో వంశీ కృష్ణను కలిసిన దగదర్తి మండలం దామవరం రైతులు
30 ఏళ్లుగా మేతపోరంబోకు భూములను సాగుచేస్తున్నట్లు వినతి
ఆ భూములపై తమకు హక్కు లేదని క్రెబ్ సంస్థ బెదిరిస్తున్నట్లు పిర్యాదు
సాగుదారుడే హక్కుదారుడు…
- కావలి ఆర్డీవో వంశీ కృష్ణను కలిసిన దగదర్తి మండలం దామవరం రైతులు
- 30 ఏళ్లుగా మేతపోరంబోకు భూములను సాగుచేస్తున్నట్లు వినతి
- ఆ భూములపై తమకు హక్కు లేదని క్రెబ్ సంస్థ బెదిరిస్తున్నట్లు పిర్యాదు
మేతపోరంబోకు భూములపై తమకు హక్కు లేదని క్రెబ్ సంస్థ బెదిరిస్తున్నట్లు దామవరం గ్రామస్థులు కావలి ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. పంచాయతీ సర్పంచి నిమ్మల ప్రసాద్ ఆద్వర్యంలో ఆర్డీవోకి వినతి పత్రం అందజేశారు.
దగదర్తి మండలం దామవరంలో మేతపోరంబోకు భూములపై తమకు హక్కులేదని, అక్కడ తాము సాగుచేసిన పంటలను ధ్వంసం చేస్తామని క్రెబ్స్ సంస్థ బెదిరిస్తున్నట్లు దామవరం గ్రామస్థులు సోమవారం కావలి ఆర్డీవో వంశీ కృష్ణకు పిర్యాదు చేశారు. పంచాయతీ సర్పంచి నిమ్మల ప్రసాద్ ఆద్వర్యంలో ఆర్డీవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ దామవరంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి 700 ఎకరాల భూమిని భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో గ్రామంలోని అన్నీ కులాల వారు గత 30 సంవత్సరాలగా సాగుచేస్తున్న మేత పోరంబోకు భూములు ఉన్నాయన్నారు. కానీ ఇటీవల క్రెబ్స్ అనే ప్రైవేట్ సంస్థ ఈ భూములు తాము కొనుగోలు చేశామని, గ్రామస్తులకు ఎలాంటి హక్కులేదని చెబుతున్నారన్నారు. తాము చేసిన పంటలను యంత్రాలతో రాత్రికి రాత్రే ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పారు. అసలు మేతపోరంబోకు భూములు ఎలా కొనుగోలు చేస్తారని వారు ప్రశ్నించారు. సాగుదారుడే హక్కుదారుడు కావాలని, వచ్చే పరిహారం సాగుచేకుంటున్న వారికే చెందాలన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లకు పిర్యాదు చేశామని, వారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.