కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం

వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి

వైసీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం

కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం…

  • వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి
  • వైసీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్ జె ఆర్ భవన్ లో వైసీపీ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం నేదురుమల్లి మాట్లాడుతూ… మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు జరిగిన మేలును వివరిచడంతోపాటు…కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. వైసిపి కార్యకర్త సింగయ్య మృతి ఘటనలో జగన్ పై కేసు నమోదు చేసిన విషయంలో న్యాయస్థానం టిడిపికి అక్షింతలు వేసిందని గుర్తు చేశారు. జులై 3న అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు ఓ విద్యా సంస్థ హెలిపాడ్ కు ఇచ్చిన స్థలం విషయంలో విద్యా సంస్థ యాజమాన్యంపై టిడిపి నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. జులై 3న జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించినా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి., చిట్టేటి హరి, ఆర్డిఏ విభాగం కార్యదర్శి పుల్లూరు సదానంద రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నక్క భానుప్రియ, నియోజవర్గం స్థాయి నాయకులు, వెంకటగిరి కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *