చెలరేగిన మంటలు
గ్యాస్ సిలిండర్ లీకేజీ…
- చెలరేగిన మంటలు
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం సెంటర్ పాత వెంకటగిరి రోడ్డులోని ఓ ఇంటిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ అయ్యి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే నాయుడుపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.