కన్నుల పండువగా హరేరామ హరేకృష్ణ భజనలు
వైభవంగా జగన్నాథుని రథయాత్ర
- కన్నుల పండువగా హరేరామ హరేకృష్ణ భజనలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఇస్కాన్ వారి అద్వర్యంలో జగన్నాధ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరణ చేసిన జగన్నాధ రథంలో జగన్నాధుడు, బలదేవుడు, సుభద్రల మూలవిరాట్లను కొలువుతీర్చి ప్రత్యేకంగా అలంకారాలు చేశారు. హరేరామ హరేకృష్ణ భజనలతో సందడి చేశారు. జగన్నాధ రధాన్ని అశేష సంఖ్యలో భక్తులు లాగుతూ పురవీధులగుండా రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో ఇస్కాన్ బృదం వారు రధం ముందు రంగవల్లులు వేస్తూ భజనలు చేస్తూ కోలాట నృత్యాలతో దేవతా మూర్తుల వేషధారణలతో అందరిని ఆకర్షించారు. రథయాత్రను బజారు వీధులు గుండా శ్రీనగర్ కాలనీ వరకు సాగించి ముగించారు. అక్కడే రథయాత్రలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాలు పంచిపెట్టారు.