20 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన సూళ్లూరుపేట పోలీసులు
భారీగా గంజాయి పట్టివేత…
- 20 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
- ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన సూళ్లూరుపేట పోలీసులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.50 లక్షల విలువ చేసే రూ. 20 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఆ మేరకు ఆయన సూళ్లూరుపేట పోలీసుస్టేషన్ లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. అరెస్ట్ అయినవారు సూళ్లూరుపేట, తడ, శ్రీసిటీ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం కింద ముద్దాయిలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.