పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఇందుకూరుపేటలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
డ్రగ్స్ తోనే యువత భవిష్యత్ నాశనం
- పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
- ఇందుకూరుపేటలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సాయిబాబా ఆలయం వరకు విద్యార్థులతో కలసి అధికారులు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే, కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగార్జున్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ హరిబాబు, హెచ్ఎం మల్లికార్జున్,ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.