ఖచ్చితంగా ప్రతీ సమావేశానికి హాజరు కావాలి
కోవూరు ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం
వెటర్నరీ శాఖపై మండిపాటు…
- ఖచ్చితంగా ప్రతీ సమావేశానికి హాజరు కావాలి
- కోవూరు ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం
నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సభకు పలు సమస్యలు తెలియజేశారు. ఈ సమావేశంలో వెటర్నరీ శాఖ పై మండిపడ్డారు. ఏ మీటింగ్ కు రావడం లేదని ఖచ్చితత్వంగా ప్రతి సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని వెటర్నరీ డాక్టర్లకు తెలిపారు. అనంతరం ఎంపీపీ పార్వతి మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులపై పంచాయతీ కార్యదర్శి సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సోలార్ సిస్టంను ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఉప ఎంపీపీ శివుని నర్సింహాలురెడ్డి మాట్లాడుతూ… రాబోయేది వర్షాకాలం కాబట్టి అధికారులు పారిశుధ్యంపై శ్రద్ధ చూపులన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కవరగిరి శ్రీలతప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ బషీర్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల కో ఆప్టెడ్ సభ్యులు జుబేర్ బాషా. ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు….