మాదకద్రవ్యాలు వద్దు… ఉజ్వల భవిష్యత్తు ముద్దు

నెల్లూరులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ర్యాలీ – పాల్గొన్న జేసీ, ఎస్పీ, జిల్లా అధికారులు

మాదకద్రవ్యాలు వద్దు… ఉజ్వల భవిష్యత్తు ముద్దు

  • నెల్లూరులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ర్యాలీ
  • పాల్గొన్న జేసీ, ఎస్పీ, జిల్లా అధికారులు

యువతీ యువకుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తూ, సమాజాన్ని కలుషితం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రతిఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కే కార్తీక్, ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని..నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి కస్తూర్బా కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వందలాది వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, అధికారులతో కలసి “మాదకద్రవ్యాలు వద్దు ఉజ్వల భవిష్యత్తు ముద్దు” వంటి నినాదాలతో కదం తొక్కారు. అనంతరం కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సభ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసీ, ఎస్పీలు మీడియాతో మాట్లాడారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాల కోసం బంగారు భవిష్యత్తును పణంగా పెట్టకండని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి సౌజన్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు, ఐ సి డి ఎస్ పి డి హేనా సుజన్, ఆర్ ఐ ఓ వరప్రసాద్, డ్రగ్ ఎడిషన్ నిర్వాహకులు రవీంద్ర, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి అయూబ్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *