మత్తుకు చిత్తుకావద్దు – నాయుడుపేటలో మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన ర్యాలీ
భవిష్యత్ పై యువత దృష్టి పెట్టాలి
- మత్తుకు చిత్తుకావద్దు
- నాయుడుపేటలో మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన ర్యాలీ
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన ర్యాలీని తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ మందిరం నుంచి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాలు బానిస కావద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈదేశ యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, మత్తుకు చిత్తుకావద్దంటూ డిఎస్పి చెంచుబాబు సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారాన్ని మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటా అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి,ఎక్సైజ్ సీఐ అరుణ కుమారి, ఎంఈఓ మునిరత్నం,ప్రభుత్వ,ప్రైవేటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.