జిల్లా న్యూక్లియస్ వైద్య అధికారి సురేంద్ర బాబు
సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయండి
- జిల్లా న్యూక్లియస్ వైద్య అధికారి సురేంద్ర బాబు
నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ సురేంద్రబాబు సందర్శించారు..ఈ సందర్బంగా ఆయన ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎం లతో సమావేశం ఏర్పాటు చేసి ఎస్టీ పాపులేషన్ వున్నచోట వారికి సికిల్ సెల్ వ్యాధిపై అవగహన కలిగించాలని.. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆయన తెలిపారు.. సురేంద్ర బాబు మీడియాతో మాట్లాడుతూ…వరల్డ్ సికిల్ సెల్ డే జూన్ 19 నుండి మొదలై జులై 3 వ తేది వరకు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఎస్టీ పాపులేషన్ లో వున్న సున్నా నుండి 40 సంవత్సరాలు వున్న ప్రతి వ్యక్తికి సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. అదే విధంగా కలువాయి మండలంలో 2586 మందికి పరీక్షలు చేయాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ లక్ష్మి, వైద్య విస్తరణ అధికారి బాల కొండయ్య, ల్యాబ్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు..