వేడుకలా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు – వైసీపీ సిటీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్, సంబరాలు, సర్వమత ప్రార్థనలు, రక్తదాన శిబిరం – ఏ పదవిలో ఉన్నా బాధ్యతగా పని చేస్తా – పర్వతరెడ్డి
హ్యాపీ బర్త్ డే చంద్ర సార్…
- వేడుకలా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు
- వైసీపీ సిటీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్, సంబరాలు, సర్వమత ప్రార్థనలు, రక్తదాన శిబిరం
- ఏ పదవిలో ఉన్నా బాధ్యతగా పని చేస్తా – పర్వతరెడ్డి
వైసీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలా నిర్వహించారు. నెల్లూరు సిటీ కార్యాలయంలో ఆయన చేత భారీ కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంరంగ వైభవంగా జరిగాయి. స్థానిక సాయి బాబా మందిరంలో స్వామి వారికి పర్వత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్ధనలు చేసి…చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులు, దీవెనలు అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానుల నడుమ ఆయన కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. హ్యాపీ బర్త్ డే చంద్ర సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసీపీ పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరిని ఆయన పేరు పేరున పలకరించి అభినందనలు వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.. ఆశేష జన వాహిని మధ్య.. జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతంలో రెడ్ క్రాస్ చైర్మన్ గా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జిగా.. ఏ పదవిలో ఉన్న.. బాధ్యతగా పనిచేసి.. ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.