ప్రగతి చారిటీస్ లో అన్నదానం – వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు – ముఖ్య అతిధిగా పాల్గొన్న కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి
ఘనంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి పుట్టిన రోజు వేడుకలు
- ప్రగతి చారిటీస్ లో అన్నదానం
- వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
- ముఖ్య అతిధిగా పాల్గొన్న కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో.. నెల్లూరులోని ప్రగతి చారిటీస్ లో వైసీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయనకి అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారితో కాసేపు సరదాగా గడిపారు. వారికి అన్నదానం చేశారు. రాణా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ….తన తండ్రి జన్మదిన వేడుకలు ఇలా పిల్లలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు, ఆశ్రిత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ…ఒక సాధారణ ఉపాధ్యాయునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగి ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి అశోక్, సుమదర్, రవి చంద్ర, శరత్, నాని, వెంకీ, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.