అపోలో క్యాన్సర్ విన్..

నెల్లూరు అపోలోలో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు

క్యాన్సర్ విన్ పేరుతో క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్ కృషి

వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆంకాలజీ వైద్య బృందం

అపోలో క్యాన్సర్ విన్…

  • నెల్లూరు అపోలోలో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు
  • క్యాన్సర్ విన్ పేరుతో క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్ కృషి.
  • వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆంకాలజీ వైద్య బృందం

నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్నీ రకాల క్యాన్సర్ లకు అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. హాస్పిటల్ ఆంకాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి. ప్రసాద్, మానసిక వైద్యలు డాక్టర్ లక్ష్మీ రాజేష్, యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు. అపోలో సంస్థ దేశ వ్యాప్తంగా క్యాన్సర్ విన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. క్యాన్సర్ విన్ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుని, క్యాన్సర్ ను పూర్తిగా జయించి, నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్న వారి మనోగతాలను ప్రజలకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తమ హాస్పిటల్ లో అన్నీ రకాల క్యాన్సర్లకు అధునాతనమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుని క్యాన్సర్ ను జయించిన వారు మాట్లాడారు. కేవలం అపోలో హాస్పిటల్ చికిత్స కారణంనే తాము నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నామని తెలిజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *