నెల్లూరు ప్రజలందరూ సహకరించాలి
30వ తేదీలోపు రొట్టెల పండుగ ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తాం
బారాషహీద్ దర్గాలో ఏర్పాట్లను పరిశీలించిన అజీజ్, కోటంరెడ్డి
అతిథి దేవోభవ…
- నెల్లూరు ప్రజలందరూ సహకరించాలి
- 30వ తేదీలోపు రొట్టెల పండుగ ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తాం
- బారాషహీద్ దర్గాలో ఏర్పాట్లను పరిశీలించిన అజీజ్, కోటంరెడ్డి
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి లోటుపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని అధికారులను ఆదేశించారు. 30వ తేదీ లోపు ఏర్పాట్లు పూర్తిచేయాలని ముందుగా వచ్చే భక్తులకు సైతం ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సూచించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… రొట్టెల పండుగ కోసం నిర్వహిస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని, ప్రతి సంవత్సరం పండగ ఎంత బాగా నిర్వహించినా గత ఏడాదికి మించి నిర్వహించాలన్న తపన ఉంటుందని తెలిపారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ… జోన్ల వారీగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని అధికారులు జోన్ల వారీగా విడిపోయి పనిచేస్తున్నారని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలిపారు. వారితోపాటు జాఫర్ షరీఫ్, సాబీర్ ఖాన్, శంషుద్దీన్, సమీ హుస్సేనీ, అస్లాం, రియాజ్, ఖాదర్ భాషా, తదితరులు పాల్గొన్నారు.