మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్
రైతులకి క్షమాపణలు చెప్పాలి…
- మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేసేవి విజయోత్సవాలు కాదని…స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట మభ్యపెడుతున్న ప్రలోభాలని విమర్శించారు. వారు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరిగా ఏ పథకం కూడా అమలు జరగలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు కాలువ నీటిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.