కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశ నిర్థేశం

ఏడాది పాల‌న‌పై ప‌వ‌ర్‌పాయంట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన సీఎం

సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ సమావేశంలో వేమిరెడ్డి దంపతులు

కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశ నిర్థేశం
ఏడాది పాల‌న‌పై ప‌వ‌ర్‌పాయంట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన సీఎం
సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ సమావేశంలో వేమిరెడ్డి దంపతులు

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో అమరావతిలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి ల సమక్షంలో జరిగిన సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే రాబోయే కాలంలో చేపట్టాల్సిన అంశాలను వివరించారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారితో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలను ఆయనతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *