కల్తీలేని వార్తలు సంచలనం రేపే కథనాలు
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు తొలి అడుగు సమావేశానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలో జరుగుతున్న తొలి అడుగు సమావేశం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు.
తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని 26వ డివిజన్లో 1.50 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్తులో మరింతగా ఉడ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కోవూరు జమ్మిపాళెం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన యువత పోరు హోరెత్తింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఆధ్వర్యంలో నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.
నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులకి త్వరిగతిన న్యాయం చేయాలని జేసీ అధికారుల్ని ఆదేశించారు.
కోవూరు జమ్మిపాళెం వద్ద జరిగిన ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది ప్రమాదం కాదు.. హత్యేనని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెళ్లడించారు.
వెంకటగిరిలో ఈదూరు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పట్టణంలో ఒక్క సారిగా భయానక వాతావరణం నెలకొంది. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు సైతం నేలకొరిగిపోయాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బారాషాహీద్ దర్గా గ్రౌండ్స్ నుండి మున్సిపల్ కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
రైతులకి యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయాధికారి శశిధర్ తెలిపారు. సంగంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఆయన రైతులకి యూరియా పంపిణీ చేశారు.
కావలిలో మిస్టర్ సింహపురి స్టీల్ మెన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ 2025′ రాష్ట్రస్థాయి పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఈ పోటీల్లో ఏలూరు వాసి బాడీ బిల్డర్ రామాంజనేయులు ఛాంపియన్ గా నిలిచారు. విజేతల్ని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభిపందించారు
బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సచివాలయ సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. జీవో నెం. 5ని సవరించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల మహా ధర్నా చేపట్టారు. అంగన్వాడీలందరికి తల్లికి వందనం పథకం అమలు చేయడంతోపాటు…ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిప్పర్ లారీ అదుపు తప్పి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాపూరులో చోటు చేసుకుంది. మృతుడు రాపూరు పట్టణానికి చెందిన నగిరి వేణుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కెమికల్ ట్యాంకర్లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ట్యాంకర్ మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటన గూడూరు రూరల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.