విశ్రాంత ఉద్యోగులు, సిబ్బందిని సత్కరించిన అధికారులు, నాయకులు
వాకాడులో ఘనంగా రెవెన్యూ దినోత్సవం
- విశ్రాంత ఉద్యోగులు, సిబ్బందిని సత్కరించిన అధికారులు, నాయకులు
తిరుపతి జిల్లా వాకాడులోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవిన్యూ డేని ఘనంగా నిర్వహించారు. రెవిన్యూ డే ఉద్దేశ్యాన్ని తహసీల్దార్ రామయ్య, డిప్యూటీ తాసిల్దార్ సందీప్ కుమార్, ఆర్ ఐ అఖిల్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు క్షుణ్ణంగా వివరించారు. విశ్రాంత రెవిన్యూ ఉద్యోగులు, కూటమి నాయకులను సత్కరించారు. వాకాడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, కొంచెం దయాకర్, ప్రజలు, రెవిన్యూ సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు.