పొదుపు ఆర్పీలకు ట్యాబ్ లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
మంచి చేసేదానికి మీ కోటంరెడ్డి ఎప్పుడూ సిద్ధం…
- పొదుపు ఆర్పీలకు ట్యాబ్ లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
ప్రజలకు మంచి చేసేదానికి మీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పొదుపు ఆర్.పి. లకు ట్యాబ్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీతో కలసి…ఆర్పీలకు ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ… మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా నాకే తెలియజేయండి అని కోరారు. ప్రజలకు మేలుచేసే ఏ కార్యక్రమానికి అయినా నా సహకారం, సంపూర్ణ మద్దత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాళ్లు, పొదుపు ఆర్పీలు పాల్గొన్నారు.