కేక్ కట్ సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు
ఘనంగా దాసరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
- కేక్ కట్ సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం టిడిపి సీనియర్ నాయకులు దాసరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి విచ్చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు..హ్యాపీ బర్త్ డే విజయ అన్న అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ…విజయ్ కుమార్ భవిష్యత్ మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయూర్ ఆరోగ్యాలు, అష్ఠైశ్వరాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.