కల్తీలేని వార్తలు సంచలనం రేపే కథనాలు
యోగాంధ్ర విజయవంతంపై అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
తమపై పెత్తనం చలాయిస్తున్నాడన్న కోపంతోనే జైహింద్ సహానిని పరదేశి, రాంకేష్ లు హత్య చేశారని నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నవాబుపేట పోలీసుస్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పిలుపునిచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలసి పరిశీలించారు.
రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలసి ఆయన పార్కులకి శంఖుస్థాపన చేశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. పలు విషయాలు, అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. మీకు, మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వాలు వెంటనే వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని కార్మికులకు అండగా నిలవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
శ్రీను అనే వ్యక్తి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఈఎంఐ సరిగా కట్టలేకపోయాడు. ఫైనాన్స్ ప్రతినిధులు అతన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో బాధితుడు చెడిపోయిన పప్పు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
చౌదరిపాళెంలో పాడుబడిన నీటి ట్యాంక్ కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు మల్లికార్జున చొరవ తీసుకొని శిథిలమైన నీటి ట్యాంక్ ని కూలగొట్టించారు
అల్లూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. గడిచిన నెల రోజుల్లో ఏడు చోరీలకు పాల్పడ్డారు. తాజాగా అంజయ్యనాయుడు కాలనీలోని మహేష్ నివాసంలో పది సవర్ల బంగారం నగలు, 70వేల నగదును దుండగులు దోచుకెళ్లారు. వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రామచంద్రాపురంలో జనసేన నేత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకి ఫిర్యాదు చేశారు.