ఇంటి నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు
ఒకే గ్రామానికి 130 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు…
- ఇంటి నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఒక్క గ్రామానికి 130 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు రామ్ సహాయం రఘురాం రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్వదహాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు వారు ప్రారంభోత్సవం చేశారు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… పేదవాడి కలే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అని అన్నారు. త్వరలోనే అన్ని పథకాలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.