అల్లూరులో నెల‌రోజుల్లో.. ఏడు చోరీలు

తాజాగా అంజ‌య్య నాయుడు కాల‌నీలో ప‌డ్డ‌ దొంగ‌లు

మ‌హేష్ నివాసంలో ప‌ది స‌వ‌ర్ల బంగారం, రూ.70వేలు న‌గ‌దు చోరీ

పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

వ‌రుస చోరీల‌తో పోలీసుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగ‌లు

అల్లూరులో నెల‌రోజుల్లో.. ఏడు చోరీలు
తాజాగా అంజ‌య్య నాయుడు కాల‌నీలో ప‌డ్డ‌ దొంగ‌లు
మ‌హేష్ నివాసంలో ప‌ది స‌వ‌ర్ల బంగారం, రూ.70వేలు న‌గ‌దు చోరీ
పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

వ‌రుస చోరీల‌తో పోలీసుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగ‌లు

నెల్లూరు జిల్లా.. అల్లూరు లోని అంజయ్య నాయుడు కాలనీలో దొంగ‌లు ప‌డ్డారు. అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఓ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో.. ఇంటి త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి.. బీరువాలో దాచిన న‌గలు, న‌గ‌దు దోచుకెళ్లిన ఘ‌ట‌న శుక్ర‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, బాధితుల వివ‌రాల‌మేర‌కు.. అంజ‌య్య‌నాయుడు కాల‌నీలో కాపురం ఉంటున్న మ‌హేష్ త‌న కుటుంబంతో క‌ల‌సి.. గురువారం సాయంత్రం దైవ ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల‌కు వెళ్లారు. మ‌హేష్ సోద‌రి వేణ‌మ్మ‌.. మ‌హేష్ ఇంటి ముందు ముగ్గేసేందుకు శుక్ర‌వారం ఉద‌యం వ‌చ్చి చూసేస‌రికి.. బ‌య‌ట గేటు త‌లుపులు తీసి ఉన్నాయి.. మ‌హేష్ వాళ్లు వ‌చ్చారేమోన‌ని.. ఇంట్లోకి వెళ్లి చూడ‌గా.. ప‌డ‌క‌గ‌దిలోని బీరువా లోని దుస్తులు, వ‌స్తువులు చెల్లాచ‌దురుగా ప‌డి ఉండ‌టంతో.. అనుమానం వ‌చ్చి.. చుట్టుప‌క్క‌ల‌వారికి స‌మాచారం అందించింది. అలాగే.. తన సోదరుడు మహేష్ కూ కాల్ చేసి.. స‌మాచారం ఇచ్చింది. అనంతరం పోలీసుల‌కు తెలియ‌జేశారు. దాంతో అల్లూరు పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఈ ఘటనలో దొంగలు.. ఇంటి తలుపులకు ఉన్న తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి చల్లబడి బీరువాలోని బంగారు ఆభరణాలు నగదను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ చోరీలో పది సార్లు బంగారు ఆభరణాలతో పాటు 70000 రూపాయల నగదును దుండగులు అపహరించకపోయినట్లు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో అల్లూరులో ఏడు చోట్ల చోరీలు జరగటం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *