3,4,5 తరగతుల తరలింపు ఆపాలి
పెట్లూరు, లాలాపేట ప్రాధమిక పాఠశాలల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థుల నిరసన
మా బడి మాకే కావాలి…
-3,4,5 తరగతుల తరలింపు ఆపాలి
- పెట్లూరు, లాలాపేట ప్రాధమిక పాఠశాలల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థుల నిరసన
తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు, లాలాపేట ప్రాధమిక పాఠశాలల ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనకు దిగారు. 3,4,5 తరగతుల తరలింపును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. మా బడి మాకే కావాలి…మా పిల్లలు మా బడిలోనే చదవాలంటూ నినాదాలు చేశారు. మా గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల పిల్లలను సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలోని పాఠశాలకు వెళ్ళేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని తెలుసుకున్న గ్రామస్దులు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలోనే పాఠశాల ఉండేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ 3 న్యూస్ మాట్లాడుతూ తమ బాధను వెల్లబుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.