పాడుబడిన నీటి ట్యాంక్ కు మోక్షం..

కావలి మండలం చౌదరి పాలెంలో శిథిలం అయిన నీటి ట్యాంక్ ను కూలగొట్టిన ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులు – ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు

పాడుబడిన నీటి ట్యాంక్ కు మోక్షం…

  • కావలి మండలం చౌదరి పాలెంలో శిథిలం అయిన నీటి ట్యాంక్ ను కూలగొట్టిన ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులు
  • ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు


చౌదరిపాళెంలో పాడుబడిన నీటి ట్యాంక్ కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు మల్లికార్జున చొరవ తీసుకొని శిథిలమైన నీటి ట్యాంక్ ని కూలగొట్టించారు.


నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరి పాలెంలో ఈదురు గాలులు వీస్తున్నాయంటే హడలి పోయేవారు. ఇక వర్షాకాలం, తుపానులకాలం వచ్చిందంటే భయాందోళనకు గురయ్యేవారు. ఇంతకీ కారణం ఏంటంటారా… ఊరు మధ్యలో పాడుబడిన ఓ వర్ హెడ్ నీటి ట్యాంక్ ఉండడమే. గాలులకు కూలి ఎవరిపై పడుతుందోనన్న భయాందోళన గ్రామస్తులను వెంటాడుతూ వచ్చింది. 40 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ట్యాంక్ కు నీటి సప్లయ్ ఆగిపోయింది. దీంతో గత దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా మారింది. గ్రామంలో కొత్త ట్యాంక్ నిర్మాణం కూడా చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ ట్యాంక్ ను పడగొట్టించాలని గ్రామస్తులు అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోలేదు. గ్రామస్థుడు మల్లికార్జున చొరవతీసుకుని అధికారులను పట్టుబట్టగా ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఎట్టకేలకు ట్యాంక్ ను కూలగొట్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *