సూళ్లూరుపేటలో స్కూల్ బస్సులపై ఆర్టీవో తనిఖీలు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు …
- సూళ్లూరుపేటలో స్కూల్ బస్సులపై ఆర్టీవో తనిఖీలు
స్కూల్ బస్సుల యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సూళ్లూరుపేట ఆర్టీవో అనిల్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ వద్ద ఆర్టీవో పర్యవేక్షణలో సిబ్బంది ప్రైవేట్ స్కూల్ వాహనాల తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. వాహనాల పత్రాలు, డ్రైవర్ల లైసెన్స్ భద్రతా చర్యలను పరిశీలించి లోపాలు ఉన్న వాహనాలకు యాజమాన్యానికి సూచనలు చేశారు. విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కూల్ బస్సుల యాజమాన్యంతో పాటు డ్రైవర్లకు ఆర్టీవో పలు సూచనలు చేశారు.