సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఆనంద్

యోగా దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఆనంద్

  • యోగా దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు


అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో నెల్లూరు కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ లు పాల్గొన్నారు.


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూన్‌ 21 శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సుకు నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీసీ హాలు నుంచి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… జిల్లాలో గ్రామ,వార్డుస్థాయి నుంచి మండలస్థాయి వరకు 7వేల ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడివోలు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ తమ పరిధిలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో నోడల్‌ ఆఫీసర్‌ యతిరాజ్‌, డిఇవో బాలాజీరావు, జడ్పీ సిఇవో మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *