సింహపురి ఇంటర్నేషన్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన
నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
- సింహపురి ఇంటర్నేషన్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన
సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మడం నేరమని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్ను వేణు అన్నారు. నెల్లూరు జిల్లా టి.పి.గూడూరు మండలం సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ… ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ…పాఠ్యపుస్తకాల్ని కూడా అధిక ధరలకి విక్రయించడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సింహపురి ఇంటర్నేషన్ స్కూ్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పలు సమస్యలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దేవేంద్ర, జిల్లా నాయకులు యగ్నేష్, దివేశ్,యశ్వంత్,బాబి, సుకుమార్, నాగేంద్ర, వంశీ,లోకేష్, యోషిక్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు.