డీఈవో కార్యాలయం ఎదుట ఏబీవీపీ నిరసన
డీఈవో దిష్టిబొమ్మ దగ్ధం
కలెక్టర్ గారు…డీఈవోని సస్పెండ్ చేయండి
- డీఈవో కార్యాలయం ఎదుట ఏబీవీపీ నిరసన
- డీఈవో దిష్టిబొమ్మ దగ్ధం
నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. డీఈవో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. డీఈవోని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ గారు….నెల్లూరు జిల్లా డీఈవోని వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం దర్గామిట్టలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. డీఈవో దిష్టిబొమ్మ దగ్ధం చేసి…ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు భరత్, హేమంత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ…విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని డీఈవోని కలస్తే తమను నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని డీఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.