ప్రతీ రోజు ఏదో ఒక చోట దారుణాలు
మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద ధ్వజం
కూటమిలో మహిళలకు రక్షణ కరువు..
- ప్రతీ రోజు ఏదో ఒక చోట దారుణాలు
- మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద ధ్వజం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో, మహిళలు, చిన్నపిల్లల భద్రత రక్షణ విషయంలో ఘోరంగా విఫలమైందని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మహిళా నాయకురాళ్లతో కలసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ రోజు ఏదో ఒక మహిళలపై దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బాధిత మహిళలకు వైఎస్ఆర్సిపి మహిళా విభాగం తోడుగా నిలుస్తుందని… వారికి సరైన న్యాయం జరిగే వరకూ వారి తరఫున మేము పోరాడుతామన్నారు.