ఏఎస్పేట క్రాస్ రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను సందర్శించిన ఆర్డీవో
ప్రమాదాల నివారణకు చర్యలు…
- ఏఎస్పేట క్రాస్ రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను సందర్శించిన ఆర్డీవో
రోడ్డు ప్రమాదాల నివారణకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీవో పావని ఆదేశించారు. ఏఎస్పేట క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను ఆమె అధికారులతో కలసి సందర్శించారు.
నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆత్మకూరు ఆర్డీవో పావని ఇతర శాఖల సిబ్బందితో కలిసి సందర్శించారు..ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ఆర్డీవో పరిశీలించారు. ఈ ప్రాంతంలో తరచు ప్రమాదాలు జరగకుండా శాశ్వత నివారణకు తీసుకోవాలసిన చర్యల కోసం మంత్రి ఆనం ఆదేశాలతో రవాణా, పోలీస్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అథారిటీ శాఖల అధికారులతో ఆమె చర్చించారు.. ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆర్డిఓ ఈ ప్రాంతంలో వెంటనే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.