ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో విచారణ
నెల్లూరు కోర్టు వద్ద పటిష్ట భద్రత –
చిరునవ్వుతో.. అందర్నీ పలకరిస్తూ.. కోర్టులోకి వెళ్లిన గోవర్థన్‌రెడ్డి
కోర్టుకు.. కాకాణి..!
ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో విచారణ
నెల్లూరు కోర్టు వద్ద పటిష్ట భద్రత
చిరునవ్వుతో.. అందర్నీ పలకరిస్తూ.. కోర్టులోకి వెళ్లిన గోవర్థన్‌రెడ్డి
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి బెయిల్ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే..కేసుల మీద కేసులు ఆయనకు చుట్టుకుంటున్నాయి. వాటిని వేగవంతంగా పూర్తి చేసి.. ఆయా కేసుల్లో శిక్ష పడేలా చేయాలని యంత్రాంగం చకచకా విచారణ చేపడుతున్నారు. ఒక కేసు తర్వాత.. మరో కేసు గోవర్థన్‌రెడ్డిని సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే కాకాణి రస్తుం మైనింగ్ కేసులు, అట్రాసిటీ కేసుల్లో రిమాండ్ లో ఉన్న కాకాణిపై సోషల్ మీడియా వేదికగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా చిత్రాలను మార్ఫింగ్చేసి పోస్టు చేయడంపై సీఐడీ కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టింది. ఇటీవలే ఆయన్ను గుంటూరు సీఐడీ కోర్టుకు కూడా తరలించారు. మళ్లీ ఆయనపై సర్వేపల్లి రిజర్వాయర్‌లో ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సంతకం ఫోర్జరీ కేసులో సిట్ విచారణ కూడా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి బుధవారం నెల్లూరు కేంద్ర కారాగరంలో ఉన్న కాకాణి గోవర్థన్‌రెడ్డిని నెల్లూరు కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచే నెల్లూరు కోర్టులో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాకాణి కోర్టుకు వస్తున్నారన్న విషయం తెలుసుకుని.. సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ నేతలు, కార్యకర్తలు, కాకాణి అభిమానులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో గట్టి చర్యలు చేపట్టారు. కాకాణి కోర్టుకు రావడంతో.. అందరూ ఆయన్ను పలకరించే యత్నం చేశారు. కాకాణి కూడా చిరున్వుతో.. అందర్నీ విష్ చేస్తూ.. తన లాయర్లతో మాట్లాడుతూ.. కోర్టులోకి వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి సుమారు గంటకుపైగా వాదనలు జరుగుతున్నాయి.