డక్కిలిలో ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ అవగాహన సదస్సు
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల
ఆదర్శ గ్రామంగా కందలవారిపల్లి
- డక్కిలిలో ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ అవగాహన సదస్సు
- ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల
తిరుపతి జిల్లా డక్కిలి మండలం కందలవారిపల్లి గ్రామంలో ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెంకటగిరి శాసన సభ్యులు కురుకొండ్ల రామకృష్ణ విచ్చేశారు. మండలం టీడీపీ నాయకులు, అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ… ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ ’ కింద సుమారు 63 వేల గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని… 5 కోట్లకు పైగా ప్రజలకు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా పరిధిలో మూడు మండలాల్లో ఒక్కొక్క గ్రామం మాత్రమే ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో డక్కిలి మండలంలో కందులవారిపల్లి గ్రామం ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ ’ కి ఎంపికైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి , సుధీర్ రెడ్డి , తహసీల్దర్ శ్రీనివాసులు, ఎంపీడీవో గుణశేఖర్, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.