బంగారుపేటకి చెందిన సత్తల బాలాజీగా గుర్తింపు
కాలువలో స్నానానికి దిగి వృద్ధుడి మృతి
- బంగారుపేటకి చెందిన సత్తల బాలాజీగా గుర్తింపు
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట రెండో వార్డుకి చెందిన సత్తల బాలాజీ తెలుగుగంగ లింకు కాలువలో స్నానానికి వెళ్లి మృతి చెందాని పోలీసులు తెలిపారు. ఆయన వివరాల మేరకు బంగారుపేటకు చెందిన సత్తల బాలాజీ సోమవారం సాయంత్రం తెలుగుగంగ లింకు కాలువలో స్నానానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం కాలువలో బాలాజీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.