బహిరంగ ప్రదేశాలు, మహిళల రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
నుమానాస్పద కదలికలపై కట్టుదిట్టమైన నిఘా
డ్రోన్ నిఘా చిత్తూరు…
- బహిరంగ ప్రదేశాలు, మహిళల రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
- నుమానాస్పద కదలికలపై కట్టుదిట్టమైన నిఘా
మహిళల భద్రతనూ చిత్తూరు జిల్లా ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు పట్టణంపై డ్రోన్ తో నిఘా పెట్టారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్‌కు వెళ్లే మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ టి. సాయినాథ్ పర్యవేక్షణలో… ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో మహిళల రక్షణ కోసం తమ సేవలు అందిస్తున్నారు. మహిళల భద్రతే ద్యేయంగా చిత్తూరు పోలీసులు పనిచేస్తామని, ఇది ఏవైనా అనుమానాస్పద కదలికలు ఉన్న సందర్భాల్లో వెంటనే గుర్తించి, పోలీసులు తక్షణమే స్పందించేలా ఉపయోగపడుతుందని ఎస్పీ పేర్కొన్నారు.