ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజు వసూళ్లు – తల్లిదండ్రుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్న స్కూల్ యాజమాన్యం – ఇందుకూరుపేట శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన
శ్రీ చైతన్య స్కూల్ ని సీజ్ చేయాలి
- ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజు వసూళ్లు
- తల్లిదండ్రుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్న స్కూల్ యాజమాన్యం
- ఇందుకూరుపేట శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన
ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న శ్రీ చైతన్య స్కూల్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నరేంద్ర డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పరిధిలోని 6 వ మైలు వద్ద ఏర్పాటు చేసి ఉన్న శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వ్యవహరించడం దారుణమన్నారు. తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాం తదితర విద్యా సామాగ్రిని కూడా యాజమాన్యమే అమ్మటం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే విద్యాశాఖాధికారులు స్పందించి శ్రీ చైతన్య స్కూల్ ని సీజ్ చేయడంతోపాటు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు విక్రమ్, దేవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు యగ్నేష్, దివేశ్,యశ్వంత్,బాబి, సుకుమార్, నాగేంద్ర, సంతోష్, దిలీప్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..