శిరీషాను ఫోన్ లో పరామర్శించిన సీఎం – బాధిత మహిళకి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం
మహిళను చెట్టుకి కట్టేశారు…
చంద్రబాబు సీరియస్ అయ్యారు
- శిరీషాను ఫోన్ లో పరామర్శించిన సీఎం
- బాధిత మహిళకి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకి కట్టేసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. బాధిత మహిళ శిరీషను సీఎం ఫోన్ లో పరామర్శించారు. నారాయణపురంలో జరిగిన ఘటన గురించి మహిళను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని శిరీషకు ఆయన సూచించారు. వెంటనే చంద్రబాబు బాధిత మహిళలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో సీటు ఇవ్వాలని బాధిత మహిళ సీఎంని కోరింది. మహిళకు అన్నివిధాలా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.