అప్పు తీర్చలేదని

మహిళను చెట్టుకి కట్టేసి చంపేస్తామంటూ బెదిరింపులు

కుప్పం నారాయణపురంలో దారుణం

అప్పు తీర్చలేదని…

  • మహిళను చెట్టుకి కట్టేసి చంపేస్తామంటూ బెదిరింపులు
  • కుప్పం నారాయణపురంలో దారుణం

తీసుకున్న అప్పు తీర్చలేదని…ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో చెట్టుకి కట్టేసిన అమానుష సంఘటన… చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు…నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను భర్త గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. దీంతో బాధితురాలు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ చేసిన అప్పులు తీరుస్తూ వస్తోంది. సకాలంలో తీసుకున్న నగదు చెల్లించలేదని రోడ్డుపై వెళుతున్న శిరీషాను మునికన్నప్ప కుటుంబ సభ్యులు ఈడ్చుకుంటూ వెళ్లి పక్కనే చెట్టుకి తాడుతో కట్టేసి నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ దాడి చేస్తూ…అప్పు తీర్చకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *