వెంకటగిరిలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
కూటమిలో పెరిగిపోయిన అవినీతి…
- వెంకటగిరిలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
మన్నవరం బెల్ పరిశ్రమ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ…తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ ఆర్చి వద్ద కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్, నిరసన చేపట్టారు. స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు అవినీతిలో పెట్రేగిపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో సైదాపురం మైనింగ్ గనుల్లో అవినీతి అక్రమ రవాణా చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. గత వైసిపి ప్రభుత్వం 11 సీట్లకే పరిమితం అయిందని ఎగతాళి చేస్తున్నారని… రానున్న ఎన్నికల్లో మీ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.