ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
వైసీపీ నేతలతో కలసి జగన్ అంటే నమ్మకం
చంద్రబాబు అంటే మోసం.. పుస్తకావిష్కరణ
చంద్రబాబు మాటలు..ఆయన నీచ సంస్కృతికి నిదర్శనం
- ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
- వైసీపీ నేతలతో కలసి జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం.. పుస్తకావిష్కరణ
143 హామీలు గుప్పించి చంద్రబాబు ప్రజలను నిలువునా మోసం చేశారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం.. పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం…అబద్ధపు హామీలు గుప్పించి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో..అలాగే వైఎస్ఆర్సిపి నేతలపై చేస్తున్న దాడులను.. పుస్తకంలో వివరించి ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి మాట్లాడారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ గా మారారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే అధికారులు పనిచేయాలని.. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.