సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి

అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ ఆనంద్ – నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి

  • అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ ఆనంద్
  • నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి సంతృప్త స్థాయిలో ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లో పిజిఆర్‌ఎస్‌ అర్జీలు, ఉపాధిహామీ, హౌసింగ్‌, పిఎం సూర్యఘర్‌ యోజన పథకం, యోగాంధ్ర మొదలైన అంశాలపై సబ్‌కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… పిజిఆర్‌ఎస్‌లో పరిష్కరించిన అర్జీలపై అర్జీదారుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. అలాగే అర్జీల ఆడిటింగ్‌ను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పొందేటువంటి పౌరుల నుండి సచివాలయ సిబ్బంది ద్వారా తప్పనిసరిగా ప్రజాస్పందన తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, అలాగే శిక్షకులతో సిటిజన్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జేసీ కార్తీక్, డిఆర్‌వో ఉదయభాస్కర్‌, మున్సిపల్ కమిషనర్ నందన్, జడ్పీ ఇంచార్జి సీఈవో మోహన్ రావు, హౌసింగ్‌, డ్వామా పిడిలు వేణుగోపాల్‌, గంగా భవాని, విద్యుత్‌ ఎస్‌ఈ విజయన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *