-మహర్షి మహేశ్ వేదిక్, మంత్ర రాజ పీఠంవారితో కలసి శ్రీకారం చుట్టిన ఆదిశంకర విశ్వవిద్యాలయం
మూడు రోజులపాటు 310 కిలోమీటర్ల సప్తగిరుల యాత్ర
యాత్రలో పాల్గొన్న వంకి పెంచలయ్య, పీఠాధిపతి, ఆయా వర్సిటీల సిబ్బంది, భక్తులు
ప్రప్రథమంగా తిరుమల సప్తగిరుల పరిక్రమ యాత్ర-మహర్షి మహేశ్ వేదిక్, మంత్ర రాజ పీఠంవారితో కలసి
శ్రీకారం చుట్టిన ఆదిశంకర విశ్వవిద్యాలయం
మూడు రోజులపాటు 310 కిలోమీటర్ల సప్తగిరుల యాత్ర
యాత్రలో పాల్గొన్న వంకి పెంచలయ్య, పీఠాధిపతి, ఆయా వర్సిటీల సిబ్బంది, భక్తులు
తిరుమల సప్తగిరుల పరిక్రమ యాత్రకు మొట్టమొదటిసారిగా.. ఆదిశంకర విశ్వవిద్యాలయం.. మహర్షి మహేశ్ వేదిక్ విశ్వవిద్యాలయంతోపాటు మంత్ర రాజ పీఠం వారు సంయుక్తంగా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గూడూరులోని ఆదిశంకర విశ్వవిద్యాలయం ఆవరణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తి పరవశంతో, శ్రద్ధతో, శ్రీవారి అనుగ్రహంతో ఈ తిరుమల సప్తగిరుల పరిక్రమ యాత్ర మొదలు పెట్టారు. మూడు రోజులపాటు దేవలోక్ అలిపిరి స్వామివారి పాదాల వద్ద నుంచి సుమారు 310 కిలోమీటర్ల మేరా ఈ తిరుమల సప్తగిరుల యాత్రను ఆదిశంకర విశ్వవిద్యాలయం అధినేత వంకి పెంచలయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. తిరుమల ఏడుగిరుల చుట్టూ ప్రదక్షిణ, మార్గమధ్యంలో 16 పురాతన దేవాలయాలను వారు సందర్శిస్తారు. ఈ యాత్రవల్ల గత జన్మల పాప విమోచనం, శరీరారోగ్యానికి తోడ్పాటు, ఆధ్యాత్మిక శ్రద్ధ, మానసిక శాంతి, సనాతన ధర్మానికి ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అనేక లాభాలు పొందనున్నారు. ఈ యాత్ర గత శనివారం ఉదయం 6 గంటలకు మొదలై.. నేటితో ముగియనుంది.