కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసనలు
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం నాయకుల డిమాండ్
ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆందోళన
తల్లికి వందనం దళిత పిల్లలకు అన్యాయం జరుగుతుందని దళిత సంఘర్షణ సమితి నిరసన
ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రజా సంఘాలు
కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసనలు
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం నాయకుల డిమాండ్
ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆందోళన
తల్లికి వందనం దళిత పిల్లలకు అన్యాయం జరుగుతుందని దళిత సంఘర్షణ సమితి నిరసన..
కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద వివిద సమస్యలపై సోమవారం ప్రజా సంఘాలు నిరసనలు హోరెత్తించారు. కావలి ఆర్డీవో వంశీ కృష్ణకు వినతులు అందించి పరిష్కరించాలని కోరారు.
అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని సిపిఎం పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు.
జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి పెంచలయ్యలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జీవో 30 ప్రకారం
పట్టణంలో పోరంబోకు స్థలాలలో 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని , నిరుపయోగంగా ఉన్న జగనన్న కాలనీలను , టీడ్కో గృహాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల పై బుక్స్ , యూనిఫారాల పేరుతో అధిక ఫీజులు వసూల్ చేస్తున్నట్లు మాజీ రాష్ట్ర పీడీఎస్ యు నాయకులు కరువది భాస్కర్ తెలిపారు.స్కూల్స్ ను తనిఖీ చేయడంలో విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దళితులకు వివిధ కారణాలు చూపి తల్లికి వందనం పథకం రాకుండా చేస్తున్నారని, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు..