ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
రామచంద్రాపురంలో పార్టీ నాయకులతో కలసి డ్రైన్ శంకుస్థాపన
ఎంపీ నిధులతో త్వరలోనే సచివాలయ నిర్మాణం
త్వరలో వీపీఆర్ నేత్ర
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి..
రామచంద్రాపురంలో పార్టీ నాయకులతో కలసి డ్రైన్ శంకుస్థాపన..
ఎంపీ నిధులతో త్వరలోనే సచివాలయ నిర్మాయ..
బుచ్చిరెడ్డిపాళెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు.పట్టణంలోని 20వ వార్డు రామచంద్రపురంలో డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు ఆమె కు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.10 లక్షల నుడా నిధులతో డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రామచంద్రపురం గ్రామానికి అత్యంత ప్రాధాన్యత కల్పించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గ్రామంలోని స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామన్నారు. గ్రామంలో సచివాలయం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చారని త్వరలోనే ఎంపీ నిధులతో గ్రామ సచివాలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విపిఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా త్వరలోనే నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ,ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు…