స్ధానిక బీజేపీ నాయకులతో బస్టాండ్ ఆవరణం పరిశీలించిన సురేష్ రెడ్డి
సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం
బుచ్చి ఆర్టీసీ బస్టాండు ఆకస్మిక తనిఖీ
స్ధానిక బీజేపీ నాయకులతో బస్టాండ్ ఆవరణం పరిశీలించిన సురేష్ రెడ్డి…
సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం..
గత ప్రభుత్వం ఆర్టీసీ నిధులను దుర్వినియోగం చేసిందనీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఎద్దేవా చేశారు…నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు..స్ధానిక బీజేపీ నాయకులతో కలిసి బస్టాండు ఆవరణలో పరిసరాలను పరిశీలించిన సన్నపురెడ్డి సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బుచ్చి ఆర్టీసీ బస్టాండును ప్రజలు ఉపయోగించుకోవాలనీ కోరారు.. కూటమి ప్రభుత్వం ఆర్టీల అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి పెట్టిందనీ అన్నారు..ఆయన వెంట బీజేపీ నాయకులు రామిశెట్టి కళ్యాణ్, కాశా శ్రీనివాసులు, వినయ్ నారాయణ, మోహన్, శ్రీను పలువురు ఉన్నారు..