-సీఎం ఆశిస్సులు.. మంత్రి సహకారంతో వందల కోట్లతో రూరల్ అభివృద్ధి
నారాయణ పుట్టినరోజున పేద విద్యార్థిని దత్తత తీసుకున్నా
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
కోటంరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు జరపుకోవడం ఆనందంగా ఉంది
మంత్రి పొంగూరు నారాయణ వెళ్లడి
నారాయణ సార్..
బర్త్‌డే జరపడం నా బాధ్యత..!
సీఎం ఆశిస్సులు.. మంత్రి సహకారంతో వందల కోట్లతో రూరల్ అభివృద్ధి
నారాయణ పుట్టినరోజున పేద విద్యార్థిని దత్తత తీసుకున్నా
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
కోటంరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు జరపుకోవడం ఆనందంగా ఉంది
మంత్రి పొంగూరు నారాయణ వెళ్లడి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డిల ఆధ్వర్యంలో.. మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వర్షాన్ని కూడా లేక్క చేయకుండా.. రూరల్ పార్టీ కేడర్ పెద్ద ఎత్తున హాజరైంది. నారాయణకు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి సందడి చేశారు. మహిళలు దిష్టితీశారు. అనంతరం భారీ కేక్ కట్‌చేసి.. కోటంరెడ్డి బ్రదర్స్‌కు తినిపించారు. కేకలు, కేరింతలు, ఆనందం మధ్య అందరూ మంత్రికి జన్మదిన శుభాకాంక్షులు తెలిపారు. ఈసందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. నారాయణ సార్ బర్త్‌డే జరపడం తన బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి ఆశిస్సులు, మంత్రి నారాయణ సహకారంతో నెల్లూరు రూరల్‌లో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే.. నారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేద విద్యార్థి గురుచరణ్ సింగ్ చదువుకోసం దత్తత తీసుకున్నానని.. ఉన్నత చదువులకు ఎంత ఖర్చైనా భరిస్తానని ఈసందర్భంగా శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సాధారణంగా బర్త్‌డే వేడుకలు చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని.. మంత్రిగా అందరి కోరికమేరకు వేడుకల్లో పాల్గొన్నానని స్పష్టం చేశారు. నా.. పుట్టిన రోజైనా.. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. వీఆర్ హైస్కూల్‌లో కేవలం పేద పిల్లలకు అడ్మీషన్లు కల్పిస్తున్నామని.. నెల్లూరు రూరల్‌లో కూడా కొంత మందికి అవకాశం కల్పించామన్నారు. తనకు సిటీ.. రూరల్ సమానమేనని.. అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా కోటంరెడ్డి సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, రాజానాయుడు, భానుశ్రీ, జన్ని రమణయ్య, జలదంకి సుధాకర్, మధన్, చక్రి తదితరులు పాల్గొన్నారు.