జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు
ఘనంగా తెలంగాణా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు
- జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ జిల్లా నాయకులు వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు మంగీలాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అభిమానులు జై కాంగ్రెస్ జై భట్టి అంటూ నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.