సీఎం హామీని అమలు చేస్తాం

రొట్టెల పండుగకి అన్నీ ఏర్పాట్లు – మంత్రి నారాయణ

రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే, నుడాచైర్మన్, అధికారులతో మంత్రి సమీక్ష

సీఎం హామీని అమలు చేస్తాం…

  • రొట్టెల పండుగకి అన్నీ ఏర్పాట్లు
  • మంత్రి నారాయణ
  • రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే, నుడాచైర్మన్, అధికారులతో మంత్రి సమీక్ష


జులై 6 నుంచి జరగనున్న బారాషహిద్ రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, అధికారులతో కలసి మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఇతర ముఖ్య విషయాలపై సుదీర్ఘగంగా చర్చించారు.


నెల్లూరు బారాషహీద్ దర్గాలో త్వరలో జరగనున్న రొట్టెల పండుగకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సందర్భంగా రొట్టెల పండగ ఏర్పాట్లపై కలెక్టరేట్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా ఛైర్మెన్ లతో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పండుగ సమయంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని…అందుకు కావాల్సిన ఏర్పాట్లు త్వరితిగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ ,ఇతర ముఖ్య ఏర్పాటుపై ఇంచార్జి కలెక్టర్ కార్తీక్ ,ఎస్పీ కృష్ణకాంత్ తో వారు చర్చించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ…బారాషాహీద్ దర్గా లో 25 వేల మంది ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకునేలా ఒకే వేదిక ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…రొట్టెల పండుగ సందర్భంగా బారా షాహిద్ దర్గా అభివృద్ధికి ఐదు కోట్ల నిధులు సీఎం చంద్రబాబు విడుదల చేయడం హర్షినీయమన్నారు. దర్గా అభివృద్ధికి మంత్రి నారాయణ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ…రొట్టెల పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. నుడా నుంచి నా వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సమావేశంలో అధికారులు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *